WGL: వరంగల్‌లో CGHS వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. సోమవారం ఎంపీ డా. కడియం కావ్య, అదనపు డీజీ డా. పర్వీన్ బాలాతో కలిసి కేయూ క్రాస్ సమీపంలోని భవనాన్ని పరిశీలించారు. దీపావళి నాటికి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఈ కేంద్రంతో ఎంతో మేలు చేకూరనుంది.
తెలంగాణ
దీపావళి నాటికి CGHS వెల్‌నెస్ సెంటర్


