హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ రోజు విషాదం..!

KMM: వినాయక చవితి పర్వదినాన జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూసుమంచి పాత పోస్టాఫీస్ వద్ద ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో పోచారానికి చెందిన సట్టు శ్రీను(48) అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె కాలు విరిగింది. స్థానికులు ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించారు.