ASR: డుంబ్రిగూడ మండలం బడిమెల గ్రామంలో అంగన్వాడీ భవనం వెంటనే ఏర్పాటు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తామర్ల సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామంలోని అంగన్వాడీలో సుమారు 44 మంది చిన్నారులు పౌష్టికాహారం పొందుతున్నారని తెలిపారు. భవనం లేకపోవడంతో ప్రస్తుతం అంగన్వాడీ ఆయా ఇంటి వద్దే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మాకు అంగన్వాడీ భవనం కావాలి'


