హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబాలపూర్ చెరువుకుజలకళ

KNR: శంకరపట్నంమండలంలోని అంబాలపూర్ గ్రామ ఊరచెరువు సోమవారం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండింది. చెరువులోకి నీరు సమృద్ధిగా చేరడంతో రైతులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. చెరువు నిండటంతో భూగర్భజలాలు పెరిగి బావులు, బోర్లలో నీటి లభ్యత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పంటల సాగుతో పాటు తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.