తూ.గో జిల్లాలో వినాయకచవితి పండగ సందడి నెలకొంది. వివిధ ఆకృతులతో కూడిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద 9999 కొబ్బరి బొండాలతో తయారు చేసిన గణపయ్య పూజలు అందుకుంటున్నాడు. సృజనాత్మకత కలిగిన ఈ అద్భుతమైన రూపం కనువిందు చేస్తోంది. ప్రజలు భారీగా తరలివచ్చి గణపయ్యను దర్శించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
9999 కొబ్బరి బొండాలతో గణపయ్య


