RR: హైడ్రా కార్యాలయంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతికి కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని ఆయన పిలుపునిచ్చారు. చెరువులు నిండి జీవవైవిధ్యం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
మట్టి గణపతికి హైడ్రా కమిషనర్ పూజలు


