హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌కు స్వల్పంగా పెరిగిన వరద

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు సోమవారం స్వల్పంగా వరద ప్రవాహం వచ్చింది. ఉదయం 6 గంటలకు రిజర్వాయర్‌లో నీటిమట్టం 389.09 మీటర్లుగా, నీటి నిల్వ 1.540 టీఎంసీలుగా నమోదైంది. క్యాచ్‌మెంట్ ప్రాంతం నుంచి 33 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఎలాంటి అవుట్‌ఫ్లో లేదు. ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.