KMM: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పాలేరు జలాశయానికి స్వల్పంగా వరద పెరిగింది. ఆదివారం రాత్రి నుంచి 775 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో, నీటిమట్టం 21.15 అడుగులకు చేరింది. దీంతో సాగర్ ఎడమ కాలువ రెండో జోన్‌కు 1575 క్యూసెక్కులు, చిన్న కాలువకు 300 క్యూసెక్కులు, భక్త రామదాసు ఎత్తిపోతల ద్వారా 275 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
పాలేరు జలాశయానికి వరద ఉధృతి


