హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా వినాయక చవితి వేడుకలు

జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు సమీపంలోని శ్రీ సూర్య ధన్వంతరి ధనలక్ష్మీ సహిత దేవాలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. విఘ్న నివారణ, లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక గణపతి పూజ, అభిషేకం, హోమం నిర్వహించి లడ్డూ నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ వడ్ల గట్ట రాజన్న, వోడ్నాల శ్రీనివాస్, రాజసాగర్ పాల్గొన్నారు.