హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజే వాహనం, సౌండ్ సామగ్రి సీజ్

RR: సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లిలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజే నిర్వహించినందుకు నిర్వాహకులు, యజమాని, ఆపరేటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే వాహనం, సౌండ్ సామగ్రిని సీజ్ చేశారు. అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేసి శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు.