హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కివీ పండ్ల గణపయ్యను చూశారా?

కాకినాడలో వినాయకచవితి పండగ సందడి నెలకొంది. వివిధ ఆకృతులతో కూడిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా 200 కేజీల కివీ పండ్లతో తయారు చేసిన గణపయ్య పూజలు అందుకుంటున్నాడు. సృజనాత్మకత కలిగిన ఈ అద్భుతమైన రూపం కనువిందు చేస్తోంది. ప్రజలు భారీగా తరలివచ్చి గణపయ్యను దర్శించుకుంటున్నారు.