హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణలో సరికొత్త జల వృక్ష జాతి

RR: తెలంగాణలో కొత్త జల వృక్ష జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రం పేరుతో దీనికి ‘అమ్మానియా తెలంగాణెన్సిస్’ (Ammannia telanganensis)గా నామకరణం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, హైదరాబాద్ శివార్లలోని నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాల్లోని తేమ నేలల్లో ఈ మొక్కను గుర్తించారు. పరిశోధన వివరాలు ‘ఫైటోటాక్సా’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.