హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ మహారాజ్‌ను దర్శించుకున్న ఎమ్మెల్యే

GDWL: జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని గజానన మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తొలి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.