హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే

E.G: వినాయక చతుర్ధ వేడుకల్లో భాగంగా జగ్గంపేట మండలంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి ఆశీస్సులతో జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి విఘ్నాలు తొలగిపోవాలని కోరుకున్నారు.