కోనసీమ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి క్షేత్రంలో కూచిపూడి నృత్య ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. కళాకారులు సంప్రదాయ కూచిపూడి నృత్యంతో గణనాథుని స్తుతిస్తూ చేసిన ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నృత్య కళాకారుల హావభావాలు, లయబద్ధమైన నృత్య విన్యాసాలు భక్తులను అలరించాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అయినవిల్లిలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన


