హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా గేమ్స్‌కు జిల్లా విద్యార్థిని ఎంపిక

HNK: జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన పల్లపు జైశ్రీ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఖేలో ఇండియా థాంగ్-టా గేమ్స్‌లో ప్రథమ స్థానం సాధించింది. ఈ విజయంతో అక్టోబర్‌లో శ్రీనగర్‌లో జరగనున్న జాతీయ స్థాయి థాంగ్-టా గేమ్స్‌కు ఎంపికైంది. తన విజయానికి సహకరించిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపింది.