హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక పూజల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్

HYD: వినాయక చవితి సందర్భంగా బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ, బషీర్‌బాగ్‌ సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడి పూజా కార్యక్రమాల్లో హైదరాబాద్ సీపీ సజ్జనార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.