హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినూత్నంగా కొలువుదీరిన వినాయకుడు

VZM: వినాయక చవితి సందర్బంగా విజయనగరం, జొన్నగుడ్డి చివరవీధి యువజన సంఘం బూస్ట్, హార్లిక్స్, బోర్న్ విటా, అమూల్య ప్యాకెట్ లతో వినూత్నంగా గణనాథుని విగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఈ సందర్బంగా ప్రజలందరికి విఘ్నాలు తొలగి విజయాలు కలగాలని వారు పూజలు చేశారు. ఈ ప్రత్యేక ప్రతిమను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కార్యక్రమంలో సంఘం పెద్దలు ఉన్నారు.