హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జువ్విగుంటలో దంచి కొడుతున్న వర్షం

ప్రకాశం: మర్రిపూడి(M) జువ్విగుంటలో సోమవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గత వారం రోజులుగా గ్రామంలో విపరీతమైన ఎండ కాస్తుండడంతో 11 దాటితే బయటకు రావటానికి భయపడే పరిస్థితి వచ్చింది. సోమవారం నాడు ఒకసారిగా వాతావరణంలో ఉదయం నుంచి మబ్బులు కమ్మి వర్షం ప్రారంభమైంది. దీంతో రైతులు వేసిన కంది పంటకు కొంతమేర ఈ వర్షం ఉపయోగకరంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.