హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోకసలవాడలో మట్టి గణపతి ప్రతిష్ఠ

VKB: గోకసలవాడ గ్రామంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి, ఎర్రటి మందార పూలు, పత్రితో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. దీపారాధన నిర్వహించి కొబ్బరికాయలు, అరటిపండ్లు, యాపిల్ తదితర పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించారు.