హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కృష్ణా: మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టితో తయారు చేసిన వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి, వేద పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు జరిపారు.