హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలగపండ్లతో 20 అడుగుల వినాయకుడు

నంద్యాల రామాలయం ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ యువ నాయకుడు ఎన్‌ఎండి ఫయాజ్ పాల్గొని పూజలు చేశారు. చిత్తూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి సేకరించిన వెలగపండ్లతో 20 అడుగుల వినాయక విగ్రహాన్ని 20 మంది కళాకారులు 7 నుంచి 10 రోజుల్లో రూపొందించారు. ఈ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.