ATP: తాడిపత్రి విజయనగర్ కాలనీలో వినాయక చవితి వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ పైపులతో గణనాథుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైపులతో రూపొందించిన ఈ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విగ్రహాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పైపులతో వెరైటీ వినాయకుడి విగ్రహం


