హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రకాశం: టంగుటూరు–సూరారెడ్డిపాలెం రైల్వేస్టేషన్ల మధ్య టోల్‌ప్లాజా సమీపంలో సోమవారం రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద చెన్నై–తెనాలి రైలు టికెట్ లభించింది. నీలం రంగు చొక్కా, జీన్స్ ధరించి ఉన్నాడు. కుడి చేతి మణికట్టుపై ‘అమ్మా నాన్న’ చేతిపై ‘OG’ అనే పచ్చబొట్లు ఉన్నాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది అని రైల్వే ఎస్ఐ అన్నారు.