HYD: వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగి, సుఖసంతోషాలు, విజయాలు కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
సీఎం ఇంట ఘనంగా వినాయక చవితి పూజలు


