హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక పూజ చేసిన మాజీ ఎమ్మెల్యే

NTR: వినాయక చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని, నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు నందిగామ పట్టణంలోని DVR కాలనీ, రైతుపేటలలోని గణేష్ మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన పూజా కార్యక్రమాలలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలందరికీ గణనాథుని దీవెనలు ఉండాలని ప్రార్థించారు.