MBNR: జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్‌లో సోమవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, కార్పొరేటర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశుని ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
తెలంగాణ
ఘనంగా వినాయక చవితి వేడుకలు


