హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి వివేక్

MNCL: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సోమవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన కోరారు.