MDCL: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మేడిపల్లి SI జలెందర్ రెడ్డి హెచ్చరించారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి చెంగిచెర్ల చెరువు కట్ట వద్ద ఆదివారం సాయంత్రం మద్యం సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగుతుందని తెలిపారు.
తెలంగాణ
చెరువు కట్టపై మద్యం సేవించిన ముగ్గురిపై కేసు


