VKB: వినాయక చవితి సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రజల జీవితాల్లోని ఆటంకాలు తొలగిపోయి సుఖసంతోషాలు, విజయం చేకూరాలని ఆకాంక్షించారు. వేడుకలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, కాలుష్య రహిత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ


