హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పినపాకలో భారీ వర్షం

BDK: పినపాక మండలంలో సోమవారం వినాయక చవితి వేళ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షంతో వాతావరణం చల్లబడింది. ఓవైపు గణేష్‌ ఉత్సవాలు జరుగుతుండగా, మరోవైపు వర్షం కురవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షంతో రైతులు కూడా ఊరట చెందుతున్నారు. మరోవైపు జిల్లాలో మరింత వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.