SDPT: భారీ వర్షాలకు అక్కన్నపేట మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. మోత్కుపల్లి - మల్లంపల్లి మార్గంలో రహదారిపైకి వరద ప్రవాహం చేరడంతో పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. సీఐ శ్రీధర్, ఎస్సై ప్రశాంత్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు కోరారు.
తెలంగాణ
వాగు ప్రవాహంతో స్తంభించిన రాకపోకలు


