హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రేమించి పెళ్లాడిన భార్యనే మట్టుబెట్టిన భర్త

SDPT: నాగదేవత గుడి శివారు ప్రాంతంలో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బీహార్‌కి చెందిన రాకేశ్, రాజీ దంపతులు ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. చిన్నకోడూరులో టీస్టాల్ నడుపుతున్న రాకేశ్, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య రాజీని గొంతు నులిమి చంపేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.