హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యాదాద్రి రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం

BHNG: యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామికి సోమవారం సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివుడిని కొలుస్తూ సుమారు గంట పాటు జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి, విభూతితో అలంకరణ చేసి అర్చించారు. అలాగే గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు.