హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పాఠశాలలకు క్రీడా గ్రాంట్

హన్మకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు రూ.50.87 లక్షల నిధులు మంజూరయ్యాయి. తెలంగాణ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 386 పాఠశాలలకు స్పోర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కేటాయించారు. ఈ నిధులతో క్రీడా సామగ్రి కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ఇతర అవసరాలకు నిధులు వినియోగించరాదని, పూర్తిగా క్రీడాకారుల కోసం వినియోగించాలని అధికారులు స్పష్టం చేశారు.