హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి పరిరక్షణకు 15న ఆందోళనలు

BHPL: కార్మికుల సమస్యల పరిష్కారం, సింగరేణి పరిరక్షణ కోసం ఈ నెల 15న ఆందోళనలు చేపట్టనున్నట్లు BMS రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ తెలిపారు. BHPLలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన కార్మికులకు భద్రతా పరికరాలు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇవ్వాలని, గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలన్నారు.