హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్ధి గణపతికి ప్రత్యేక పూజలు

సంగారెడ్డి మండల పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ దేవస్థానంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు సోమవారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామివారిని హరిద్ర వర్ణ (పసుపు) అలంకారంలో శోభాయమానంగా తీర్చిదిద్ది, సిద్ధి గణపతిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి దర్శనాలు చేసుకున్నారు.