WGL: రాయపర్తి మండల కేంద్రంలో కురుస్తున్న వర్షాలకు జక్కుల మల్లయ్యకు చెందిన పెంకుటిల్లు సోమవారం కూలిపోయింది. దీంతో తమకు నిలువ నీడ లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాలైన తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. వర్షాకాలంలో ఇల్లు కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: భారీ వర్షం.. కూలిన ఇళ్లు


