హైదరాబాద్: 28°C
తెలంగాణ

చింతకాని క్లస్టర్‌లో 1,447 మంది రైతుల నమోదు

BHPL: కాటారం మండలం చింతకాని క్లస్టర్ పరిధిలోని ఐదు గ్రామాల్లో 2,427 మంది రైతులకు గాను 1,447 మంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఏఈవో దివ్యజ్యోతి తెలిపారు. ఇంకా 980 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. కొత్తపల్లి 132, పోతులవాయి 328, చింతకాని 444, బయ్యారం 349, మేడిపల్లి 194 మంది నమోదు చేసుకున్నారని ఆమె వెల్లడించారు. రైతులు నిర్లక్ష్యం వహిస్తే నష్టపోతారని అన్నారు.