NRPT: మక్తల్ పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం పరిశీలించారు. నిర్మాణ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగవంతం చేయాలని సూచించారు. రూ.250 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పట్టణ అభివృద్ధిలో కీలకంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ
మక్తల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన


