హైదరాబాద్: 28°C
తెలంగాణ

400 మొక్కలు నాటిన గ్రామస్థులు

ADB: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాంపూర్ సర్పంచ్ హెరెకుమ్ర జంగు అన్నారు. ఇవాళ గాదిగూడ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఈజీఎస్ పథకం కింద సుమారు 400 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మొక్కల సంరక్షణతో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని, నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించాలని సూచించారు.