హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆడపిల్ల పుట్టినింటికి ఆర్థిక సాయం'

మహబూబాబాద్ 34వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటికి రూ.5 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కౌన్సిలర్ గుండా రాజశేఖర్ తెలిపారు. లక్ష్మీ టాకీస్ ప్రాంతానికి చెందిన షేక్ షామా ఇంటికి వెళ్లి ఆడపిల్ల జన్మించిన సందర్భంగా రూ. 5 వేలు అందజేశారు. ఆడపిల్లల కుటుంబాలకు తనవంతు సహకారం అందించడమే లక్ష్యమన్నారు. కౌన్సిలర్ సేవగుణం పట్లు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.