హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆస్తి పంపకాల్లో అన్యాయం.. వాటర్ ట్యాంక్‌పై నిరసన

MHBD: డోర్నకల్ మండలం జోగ్యతండలో ఉమ్మడి ఆస్తి పంపకాల విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ సోమవారం చందవత్ దాసు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. పెద్దమనుషుల పేరుతో తనపై ఒత్తిడి, బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.