హైదరాబాద్: 28°C
తెలంగాణ

అద్దె ఇంట్లో యువకుడి బలవన్మరణం

MBNR: జడ్చర్ల సరస్వతినగర్‌లో తలారి సిద్ధార్థ(22) అద్దె ఇంట్లో ఆదివారం రాత్రి ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్మపల్లికి చెందిన సిద్ధార్థ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్నాడు. తండ్రి నిరంజన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లేష్ తెలిపారు.