KMR: బీర్కూర్(M) తిమ్మాపూర్ కామన్ వద్ద రహదారి పక్కన ఏర్పాటు చేసిన మార్గ సూచిక ముళ్ల పొదలతో పూర్తిగా కూరుకుపోయింది. దీంతో సూచికపై ఉన్న వివిధ గమ్య స్థానాల పేర్లు, కిలోమీటర్ల వివరాలు ప్రయాణికులకు కనిపించడం లేదు. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు గమ్య స్థానాలకు వెళ్లే దిశ తెలియక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
తెలంగాణ
సూచిక బోర్డు ఇలా.. ప్రయాణ దూరం తెలిసేదేలా?


