NZB: భీమగల్ పట్టణంలో కురుస్తున్న వర్షంలోనూ వినాయక చవితి సందడి నెలకొంది. స్థానిక బస్టాండ్ ప్రాంతంలో గణపతి ప్రతిమలు, పూజ సామాగ్రి విక్రయాలు కొనసాగుతున్నాయి. వర్షానికి ప్రతిమలు తడవకుండా వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లు కప్పి విక్రయిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోయినా భక్తులు గొడుగులు పట్టుకుని మార్కెట్లకు వచ్చి సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: వర్షంలో కొనసాగుతున్న పండుగ సందడి


