MNCL: తెలంగాణలో రానున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మంచిర్యాల సహా పలు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాకు వర్ష సూచన


