ADB: వినాయక చవితి సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న శాంతినగర్‌లోని తన నివాసంలో మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువ నాయకుడు జోగు మహేందర్ కూడా పూజల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య గణనాథునికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న ఆదిలాబాద్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట సుఖశాంతులు వర్ధిల్లాలన్నారు.
తెలంగాణ
మాజీ మంత్రి జోగు రామన్న ఇంట్లో గణపతి పూజ


