ADB: పట్టణంలోని సుందరయ్య నగర్‌లో అనుమతులు లేకుండా డీజే ఏర్పాటు చేసిన గణపతి మండప సభ్యులు, డీజే యజమాని మహమ్మద్ అబ్దుల్ బషీర్‌లపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ CI నాగరాజు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా డీజేతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలని, అధిక శబ్దం వచ్చే డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
అనుమతి లేని డీజేలపై కేసు నమోదు: CI నాగరాజు


