హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిల గృహాల్లో ఉండొద్దు: తహసీల్దార్

MDK: అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, పెంకుటిల్లు, పూరి గుడిసెలలో ప్రజలు ఉండరాదని ఆదేశించారు. అపాయకర ఇళ్లలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆమె విజ్ఞప్తి చేశారు.